గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టడం అన్యాయం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

X
Highlights
* వలస కార్మికుల వేతనాల్లో కోతలు విధించడం దారుణం : ఎమ్మెల్సీ కవిత * ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమండ్ చేస్తున్న ఎమ్మెల్సీ కవిత * హైదరాబాద్‌లోని తన నివాసంలో గల్ఫ్ కార్మిక సంఘాలతో కవిత సమావేశం
admin23 Dec 2020 11:35 AM GMT
గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టడం అన్యాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. గల్ఫ్ కార్మికుల వేతనాల్లో కోత విధించడం దారుణమన్నారు. కార్మికుల వేతనాలను 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ.. కేంద్రప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గల్ఫ్ కార్మిక సంఘాలతో ఆమె సమావేశమయ్యారు.
ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను సుమారు రూ. 15 వేల వరకు తగ్గించారు. వలస కార్మికుల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడుతామని, ఉత్తర్వులు వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత .
Web TitleMLC kavitha responded on gulf workers problems and says it is illegeal
Next Story