MLC Kavitha: MNJ క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం

MLC Kavitha Participated in Awareness Program on Breast Cancer at MNJ Cancer Hospital
x

 MNJ క్యాన్సర్ హాస్పిటల్‌(ఫైల్ ఫోటో)

Highlights

*ఏడాదికి ఒకసారైనా మహిళలు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి : కవిత

MLC Kavitha: బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్‌లోని MNJ క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత 'బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ వాక్' ను జెండా ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏళ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తుందని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యులపై కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మహిళలు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిందిగా కోరారు. ఇక MNJ క్యాన్సర్ హాస్పటల్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆసుపత్రి ఇంచార్జీ జయలలితకు కవిత అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories