Kavitha: బండి సంజయ్‌ తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారు

MLC Kavitha Comments On Bandi Sanjay
x

Kavitha: బండి సంజయ్‌ తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారు

Highlights

Kavitha: బీఆర్‌ఎస్‌కు దైవశక్తి అవసరం.. అందుకే యాగాలు చేస్తున్నాం

Kavitha: బండి సంజయ్‌ తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలను అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సరైన సమయంలో బీజేపీకి సమాధానం చెబుతారన్న కవిత.. ఆ నాడు బతుకమ్మను ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు నేడు బతుకమ్మను అవమానిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అనేది బీజేపీకి కాంపిటీషన్‌ అని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీని మోడీ.. నన్ను బండి సంజయ్‌ అవహేళన చేశారని కవిత చిట్‌చాట్‌‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు దైవశక్తి అవసరం.. అందుకే యాగాలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయన్నారు. నిర్మలా సీతారామన్‌ వీక్‌ హిందీ గురించి కాకుండా.. వీక్‌ రూపాయి గురించి స్పందిస్తే బాగుండని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు, పసుపు బోర్డు రాకుండా నిర్మల అడ్డుకున్నారని ఆరోపించారు. భాషపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories