logo
తెలంగాణ

Jeevan Reddy: సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

MLC Jeevan Reddys Letter to CM KCR | Telugu News
X

Jeevan Reddy: సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

Highlights

Jeevan Reddy: కనీసం 10శాతం రిజర్వేషన్లు అయినా అమలు చేయాలి

Jeevan Reddy: సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో గిరిజనులను జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 12శాతంపెంచాల్సిన అవసరముందని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ నేటికీ అమలుకు నోచడం లేదని గుర్తు చేశారు. దీంతో గత 7 సంవత్సరాలుగా విద్య ,ఉద్యోగాల్లో గిరిజనులు అణిచివేత కి గురవుతున్నారన్నారు.

అలాగే అటవీ హక్కుల చట్టాన్ని అమల్లోకి తెచ్చి పోడు భూములకు హక్కులు కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని మార్చి కనీసం 10 శాతం రిజర్వేషన్లైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈప్రభుత్వానికి ఉన్న సర్వాధికారులు ఉపయోగించిన గిరిజనుల రిజర్వేషన్లపై చొరవ చూడాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Web TitleMLC Jeevan Reddy's Letter to CM KCR | Telugu News
Next Story