MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
x
Highlights

MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం ఈసీ విడుదల చేసింది.

MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం ఈసీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో మూడేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఫిబ్రవరి3, 2025 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి , 2025న ఓట్లను లెక్కిస్తారు.నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10 వరకు చివరి తేది. ఫిబ్రవరి 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ.

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మల్క్ కొమురయ్య పేరును ఖరారు చేసింది ఆ పార్టీ. వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సర్వోత్తంరెడ్డి పేరును ఆ ప్రకటించింది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. దీనిపై ఆ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోలింగ్ నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories