గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల పేర్లు ఖరారు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల పేర్లు ఖరారు
x
Highlights

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గోరేటి వెంకన్న, దయానంద గుప్తాలకు ఎమ్మెల్సీ పదవులివ్వలని కేబినెట్ నిర్ణయించింది

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాల పరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు. దీంతో ముగ్గురి పేర్లను సీఎం కేసీఆర్ గవర్నర్ వద్దకు పంపించారు. రేపు ఉదయం శాసన మండలిలో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories