Cyber Crime: సైబర్ నేరగాడి వలలో ఎమ్మెల్యే

MLA was caught in the net of a Cyber Crime
x

Cyber Crime: సైబర్ నేరగాడి వలలో ఎమ్మెల్యే

Highlights

Cyber Crime: ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అంటూ ఫోన్ కాల్

Cyber Crime: తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ వలలో చిక్కుకున్నారు. మాయమాటలు విని లక్షలు అకౌంట్‌లో జమచేశారు. తీరా డబ్బులు వేశాక ఫోన్‌లో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ ఎమ్మెల్యే సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు.

ఎమ్మెల్యేకు తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్ కాల్ చేశారు సైబర్ నేరగాడు. ముఖ్యమంత్రి ఒక కొత్త రుణపథకాన్ని ప్రారంభించబోతున్నారని.. ఆ పథకంలో వందల మందికి లక్షల్లో రుణాలు ఇవ్వబోతున్నారని నమ్మబలికాడు. మీ కోటా కింద వంద మందికి రుణాలు అందేలా చూస్తానని నమ్మించాడు. అందుకోసం ఒక్కోవ్యక్తికి 3 వేల 6 వందల రూపాయలు కమిషన్ కావాలని కోరాడు. అది విన్న ఎమ్మెల్యే వెనకా ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాడి ఖాతాలో మూడు లక్షల 60 వేలు జమ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌లో రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించారు ఆ ఎమ్మెల్యే. వెంటనే తన పీఏ ద్వారా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయించారు.

ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2008లో ఎన్టీపీఎస్‌ రామగుండంలో ఏఈగా పనిచేసిన బాలాజీ ఈ నేరానికి పాల్పడ్డట్టు గుర్తించారు. గతంలోనూ బాలాజీపై కేసులు ఉన్నాయి. 2009లో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు బాలాజీ. ఆ తర్వాత కూడా అతనిపై ఏపీ, తెలంగాణలో కలిపి 37 కేసులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories