సానియా, సెక్యూరిటీ గార్డులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : రాజాసింగ్

సానియా, సెక్యూరిటీ గార్డులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : రాజాసింగ్
x
Highlights

వికారాబాద్ అడవుల్లో కాల్పుల దర్యాప్తుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆవును దారుణంగా కాల్చి చంపితే ప్రభుత్వం చిన్న కేసు పెట్టి వదిలేయడం దారుణమన్నారు.

వికారాబాద్ అడవుల్లో కాల్పుల దర్యాప్తుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆవును దారుణంగా కాల్చి చంపితే ప్రభుత్వం చిన్న కేసు పెట్టి వదిలేయడం దారుణమన్నారు. దారూర్ మండల్ లోని సానిమా మీర్జా ఫామ్ హౌస్ లోనే ఈ ఘటన జరిగిందని , ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డుపై కేసు కూడా పెట్టారని రాజా సింగ్ అన్నారు. కానీ ఆవును సానియానే స్వయంగా కాల్చిందంటూ గ్రామస్థులు చెబుతున్నారన్నారు.. ఇప్పుడే కాదు గతంలోనూ అక్కడ జంతువులను కాల్చి చంపిన సందర్భాలున్నాయని, గతంలో సానియా ఓ నెమలిని చంపినట్లు కేసు కూడా నమోదైందన్నారు. తక్షణం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియాపైనా, ఆమె సెక్యూరిటీ గార్డుపైనా క్రిమినల్ కేసు పెట్టి విచారణ జరపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories