ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLA Quota MLC Election Polling In AP
x

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Highlights

MLC Elections: టీడీపీ పోటీకి దిగడంతో రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక

MLC Elections: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలోని మీటింగ్ హాల్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కు సంబంధించిన అన్నిఏర్పాట్లను పూర్తిచేసింది అధికార యంత్రాంగం. సాయంత్రం 4గంటల దాకా పోలింగ్ జరగనుండగా 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవాలంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి.

ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ గా హీట్ పుటిస్తున్నాయి.. ఎప్పుడూ లేనంత ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. మొత్తం 7 స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఉండగా.. ఒక స్థానంలో టీడీపీ పోటీ చేస్తోంది. వైసీపీ నుంచి బరిలో పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం ఉండగా.. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ పోటీ చేస్తున్నారు.

బలాబలాల ప్రకారం చూస్తే వైసీపీకి 7 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. దీంతో ఏకగ్రీవంగా 7 స్థానాలు తమ ఖాతాలో పడిపోతాయని వైసీపీ భావించింది. అయితే టీడీపీకి టెక్నికల్‌గా బలం లేనప్పటికీ ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎమ్మెల్యేలతో ఓటు వేయించి 7 స్థానాలను గెలిపించే బాధ్యత సీనియర్లు, మంత్రుల మీద పెట్టారు సీఎం జగన్. 7 స్థానాలకు 7 టీంలను విభజించారు. ఒక్కో టీమ్‌కు ఒక్కో సీనియర్ నేత ఇద్దరు మంత్రులను పెట్టారు. ఒక్కో ఎమ్మెల్సీని ఎన్నుకోడానికి 22 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండటంతో.. ఒక్కో టీమ్‌లో 22 మంది ఎమ్మెల్యేలు ఉండేలా టీమ్‌లు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories