తెలంగాణ హైకోర్టుకు మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

MLA Mallareddy To Telangana High Court
x

తెలంగాణ హైకోర్టుకు మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

Highlights

Malla Reddy: తనపై శామీర్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌

Malla Reddy: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనపై శామీర్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతపల్లి మండలం కేశవాపురంలో భూములను కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే.. బాధితుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్‌ వేశారు. మల్లారెడ్డి పిటిషన్‌పై జస్టిస్‌ కె.సురేందర్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్‌ ముందు ఉంచాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories