MLA Krishnarao: బైరి నరేషన్‌పై పీడీయాక్ట్ పెట్టాలి

Bhairi Naresh Made Inappropriate Comments On Ayyappaswamy
x

MLA Madhavaram: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌

Highlights

MLA Madhavaram: భైరి నరేష్‌పై త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

MLA Madhavaram: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరించేలా వాఖ్యలు చేసిన నరేశ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. అయ్యప్ప మాలధారణ అత్యంత పవిత్రమైందని, 25 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానన్నారాయన.. అయ్యప్ప స్వామిని, స్వాములను కించపరచడం దారుణమన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు ఏ మతాన్ని కులాన్ని ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఉద్బోధించారు. బైరి నరేశ్‌పై త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కృష్ణారావు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories