వైఎస్‌ షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిల..

MLA Jagga Reddy Fires on YS Sharmila
x

Jagga Reddy: తండ్రిపేరును అడ్డంపెట్టుకుని షర్మిల రాజకీయం చేయాలనుకుంటోంది 

Highlights

Jagga Reddy: నాయకులను విమర్శించడం కాదు... సమస్యలను ప్రస్తావిస్తే మంచిది

Jaggareddy: తెలంగాణలో షర్మిల తండ్రిపేరుతో రాజకీయం చేయాలనుకుంటోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్ర ఎందుకు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాజకీయం చేయాలనుకుంటుందా? నాయకులను విమర్శించాలనుకుంటుందా? ఆమెకు అర్థంకావడంలేదన్నారు. ఎక్కడికెళితే అక్కడ నాయకులను విమర్శిస్తోందన్నారు. నాయకులను విమర్శించడంకంటే... సమస్యను ప్రస్తావిస్తే మంచిదని సూచించారు.

షర్మిల బీజేపీ వదిలిన బాణమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిల బీజేపీ నాయకుల కన్నుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షర్మిల బీజేపీ నాయకులను ఎక్కడా ప్రశ్నించలేదన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. మోడీ, అమిత్‌షా రాజకీయ వ్యూహంలో షర్మిల పనిచేస్తున్నారని విశ్లేషించారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండిShow Full Article
Print Article
Next Story
More Stories