హరీష్ రావు గ్రేట్ : మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు!

హరీష్ రావు గ్రేట్ : మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు!
x
Highlights

వీధికో వినాయకుని మండపం ఏర్పాటు చేసి..ఊర్లలో హంగామా చేసి.. విపరీతంగా ఖర్చు చేయడం.. ఆ వినాయకుల్ని చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి ఇబ్బంది కలిగించడం వంటి పనులు చేయకుండా.. ఊరంతా ఒకే వినాయకుడిని నిలబెట్టి కొలిస్తే.. బహుమతి ఇస్తానన్నారు హరీష్ రావు. ఆయన తన మాట నిలబెట్టుకుని గ్రేట్ అనిపించుకున్నారిపుడు.

"గల్లీకో వినాయకుడు వద్దు ... గ్రామానికో వినాయకుడు ముద్దు " అని మాజీ మంత్రి మరియు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నినాదాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే .. ఇలాచేస్తే మీరు ఉహించని సర్ప్రైజ్ ఇస్తానని మాట ఇచ్చారు అయన .. అయితే అయన చెప్పిన ఈ కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అయన తన మాట నిలబెట్టుకున్నారు .. హరీష్ పిలుపు మేరకు మిట్టపల్లి గ్రామంలో ప్రజలంతా ఒక్కటై ఓ నిర్ణయాన్ని తీసుకొని అ గ్రామంలో ఎకదంతున్ని ప్రతిష్టించారు ... అయన ఈ ఏకదంతుని తొలి పూజలో దండి దేవనాథ జీయర్ స్వామితో కలిసి పాల్గొన్నారు. పాల్గొని తన ఇచ్చిన మాట ప్రకారం వాలీబాల్ కిట్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చారు .. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ తన మాట మీద నమ్మకం ఉంచి ఇలా ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు గాను నాకు ఎంతో ఆనందంగా ఉందని మిగతా గ్రామాలకి మిట్టపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచిందని అయన కొనియాడారు ...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories