మిషన్ భగీరథ పైప్‌ లైన్ లీక్

Bhupalapalli District: భూపాలపల్లి జిల్లాలో వృథాగాపోతున్న నీరు, మోరంచ వాగులో కలుస్తున్న తాగునీరు

Jyothi
Updated on: 29 Jun 2022 3:10 PM IST
Mission Bhagiratha Pipe Line Leak | TS News
X

మిషన్ భగీరథ పైప్‌ లైన్ లీక్

Bhupalapalli District: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఇంటింటికి మంచినీరు అందించే పథకం నీరుగారుతోంది. నాసిరకమైన పనులతో పైపులైన్లు ఎక్కడికక్కడ లీకేజీల పాలవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అయి నీరు వృథాగా పోతోంది.

గాంధీనగర్ నుండి చెల్పూరు గ్రామానికి వెళ్తున్న ప్రధాన పైప్ లైన్ జాయింట్ ఊడిపోవడంతో నీరు లైక్ అయి మోరంచ వాగులో కలిసిపోతోంది. నీటి లీకేజీపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story