Nagarkurnool: మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Nagarkurnool: మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
x
Highlights

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం కోసం వెళ్లే శివ భ‌క్తుల కోసం, ప్ర‌త్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా రెవిన్యూ అధికారి మ‌ధుసుధన్ నాయక్ అన్నారు.

నాగర్ కర్నూల్: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం కోసం వెళ్లే శివ భ‌క్తుల కోసం, ప్ర‌త్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా రెవిన్యూ అధికారి మ‌ధుసుధన్ నాయక్ అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి శివ దీక్ష చేప‌ట్టిన శివ భ‌క్తుల‌కు, ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు గాను, ప‌ట్ట‌ణంలోని స‌వేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య చికిత్సా శిబిరాన్ని డి.ఆర్.ఓ మ‌ధుసుధన్ ప్రారంభించారు.

అనంత‌రం స్వాముల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. దేశంలో కుల‌, మ‌తాల‌కు అతీతంగా హిందూ,ముస్లింలు అంతా ఒక్క‌టేన‌న్న భావ‌న‌తో అంతా క‌లిసి మెలిసి ఉంటున్నార‌ని, ఇదే స‌మ‌యంలో ప్ర‌త్యేకించి స‌వేరా ముస్లిం వెల్ఫేర్ సంస్థ శివ స్వాముల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వ‌హించ‌డం ప్ర‌శంస నీయ‌మ‌న్నారు. స‌వేరా సంస్థ‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మెడిక‌ల్ జ‌న‌ర‌ల్ స్టోర్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం, పండ్లు, మందులు ఉచితంగా ఇవ్వ‌డం వ‌ల్ల ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు.

శివ స్వాములే కాకుండా ఇత‌రులు కూడా శిబిరాన్ని వినియోగించు కోవ‌చ్చ‌న్నారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శివ స్వాముల కోసం, మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌థ‌మ చికిత్స కోసం వైద్య ప‌రీక్ష‌లు, మందులు ,పండ్లు, మ‌జ్జిగ నీళ్లు ఉచితంగా అంద‌చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు మ‌రిన్ని ఏర్పాటు చేయాల‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా టిఎన్‌జిఓ కోశాధికారి ష‌ర్ఫొద్దిన్ మాట్లాడుతూ... స‌వేరా మైనార్టీ వెల్ఫేర్ అసోస‌యేష‌న్ ఆధ్వర్యంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు.

భ‌విష్య‌తులో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌న్నారు. వంద‌లాది మంది శివ‌స్వాములు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఇలాంటి శిబిరాల వ‌ల్ల త‌మ‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న ఔష‌ధి సిబ్బంది నాగ‌మ‌ణి, నీలిమ‌, చంద్ర‌శేఖ‌ర్, డ్ర‌గ్ ఇన్స్ పెక్ట‌ర్ శ్రీ‌కాంత్ తో పాటు మైనార్టీ నాయ‌కులు ముంతాజ్, గౌస్, ఫారూఖ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories