Minister Vemula: చెట్టుకు పుట్టిన రోజు వేడుక చేసిన మంత్రి వేముల

Minister Vemula Prashant Reddy Celebrated the Birthday of the Tree
x

Minister Vemula Prashant Reddy Celebrated the Birthday of the Tree

Highlights

Minister Vemula: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి

Minister Vemula: మొదటి విడత హరితహారంలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్కకు పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు జరిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం చాలా గొప్ప నిర్ణయమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి... హరితహారం కార్యక్రమం ఓట్ల కోసం చేసేది కాదని, భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమమని అన్నారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే... తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో 7 పాయింట్ 7 శాతం అడవులు పెరిగాయని తెలిపారు. మొక్కలను సంరక్షించడం... నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు.. మొక్కలు నాటడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories