Uttam Kumar Reddy: వరద ప్రాంతాల్లో మంత్రి ఉత్తమ్ పర్యటన

Minister Uttam Visit Flood-Affected Areas
x

Uttam Kumar Reddy: వరద ప్రాంతాల్లో మంత్రి ఉత్తమ్ పర్యటన

Highlights

Uttam Kumar Reddy: రామచంద్రపురం దగ్గర గండిని పరిశీలించిన ఉత్తమ్

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లాలో వరద ప్రాంతాల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నడిగూడెం మండలం రామచంద్రాపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు నుండి, పాలేరు నుండి బ్యాక్ వాటర్ అధికంగా రావడంతో కాలువకు గండి పడిందని మంత్రి తెలిపారు.

దాదాపు మూడు వందల ఎకరాల్లో పంట మునిగిపోయిందని.. ఊర్లోకి వరద ప్రవాహం రాకపవోడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. వారం రోజుల్లో కాలువకు పడిన గండిని పూడ్చి వేయిస్తామని మంత్రి చెప్పారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీఇ ఇచ్చారు. మంత్రి వెంట కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories