Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..

Minister Uttam Kumar Participated In A Meeting With The Chairman Of National Dam Safety Authority
x

Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..

Highlights

Uttam Kumar Reddy: ఏ టెస్టులు చేయకుండానే బ్యారేజీలు కట్టారు

Uttam Kumar Reddy: కాళేశ్వరంతో కొత్తగా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కానీ మొత్తం తెలంగాణకు నీళ్లు అందించామంటూ గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. ఏ టెస్టులు చేయకుండానే బ్యారేజీలు కట్టారన్నారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ అధ్యక్షతన తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. తుమ్మిడిహట్టి దగ్గర తమ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టి తీరుతుందని, గ్రావిటీతో నీళ్లు తీసుకొచ్చేలా ప్రాజెక్టును రూపొందిస్తామన్నారు మంత్రి. 3 బ్యారేజీల్లోని గేట్లను ఎత్తి నీళ్లు కిందకు వదిలేయాలని లిఖితపూర్వకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించారని, ఆ పనులు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల ఉచిత సలహాలు అవసరం లేదని, నాశనం చేసిన వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. సాంకేతిక కమిటీ నిపుణుల సలహా మేరకే ముందుకు వెళతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories