హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల..

Minister Tummala Nageswara Rao Emotional Comments
x

హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల..

Highlights

సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయంటూ ఎమోషనల్ అయ్యారు.

Thummala Nageswara Rao: తాను అభిమానించే వాళ్లే... తనను అవమానించేలా మాట్లాడుతున్నారని, నా జిల్లాకు నీళ్లు రావాలని ఆరాటం తప్ప... తనకు సొంత ప్రయోజనాలు ఏమీ లేవని అన్నారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు తనపై మాట్లాడటం కరెక్ట్ కాదన్నారాయన.. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి చెప్పి.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాననన్నారు.

అనంతరం మంత్రి కాగానే సత్తుపల్లి టన్నెల్‌ పనులు ప్రారంభించానని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నాని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయంటూ ఎమోషనల్ అయ్యారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయ పడే వ్యక్తి కాదని మంత్రి తుమ్మల బదులిచ్చారు. అంతిమంగా జిల్లాకు నీరివ్వాలన్నాదే తన లక్ష్యమని, కీర్తి, ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు చేసిన మంచి ఫ్లెక్సీల్లో కాదు.. పనుల్లో కనపడాలని తుమ్మల అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories