Top
logo

కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా వ్యవసాయ బిల్లు..మంత్రి తలసాని

కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా వ్యవసాయ బిల్లు..మంత్రి తలసాని
X
Highlights

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య,...

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని. శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్నారు. సంఖ్య బలాన్ని పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించుకున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరేలా బిల్లు ఉందని ఆయన అన్నారు. బీజేపీ నేతలు అడ్డు అదుపు లేదని భ్రమల్లో ఉన్నారని తెలిపారు. జమ్మూకాశ్మీర్, చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం రాగానే మైలేజీ వస్తుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారన్నారు. ఇష్టం లేకపోయినా... దేశ ప్రయోజనాల మేరకు GST కి అంగీకరించారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో కనీసం తెలంగాణను ఆదుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణలో కరోనా మరణాలను తగ్గించామని తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ చట్టం పై విస్తృత చర్చ జరిగిందని ఆయన అన్నారు.

రైతులకు నష్టం కలిగించే చట్టంపై రాజ్యసభలో కనీస చర్చ జరగనివ్వలేదని ఆయన పేర్కొన్నారు. కరోనా టైం లో బీజేపీ నేతలు ప్రభుత్వాలను కూల్చే పని చేసిందని తెలిపారు. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం Jnnurm కింద హైదరాబాద్ శివార్లలో 91 చోట్ల 45,951 ఇల్లు కట్టారన్నారు. నగర శివార్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో 90 శాతం హైదరాబాద్ నగర వాసులకే కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. GHMC పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాజ్యసభ లో వెంకయ్యనాయుడుకి వ్యవసాయ బిల్లు ఇష్టం లేదు కాబట్టే సీట్లో కూర్చోలేదన్నారు. రైతులతో గోక్కున్నోడు ఎవడు బాగుపడలేదని తెలిపారు. రాబోయే కాలంలో బీజేపీ అనుభవిస్తుందన్నారు. కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశ వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని స్పష్టం చేసారు.

Web TitleMinister Talsani Srinivas Yadav Comments On Central Government
Next Story