మాంసం అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ర్య‌లు : మంత్రి తలసాని

మాంసం అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ర్య‌లు : మంత్రి తలసాని
x
Highlights

రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాక్ డౌన్...

రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాక్ డౌన్ క్ర‌మంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి.

పశుసంవర్ధక శాఖ , మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమిస్తామ‌ని తెలిపారు. లాక్‌డౌన్‌తో జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయన్నారు తలసాని. ఇకపై ఆ పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్లు, గుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి , అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామ‌న్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories