గిరివికాసం పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సత్యవతి రాథోడ్

గిరివికాసం పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సత్యవతి రాథోడ్
x
Highlights

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి గిరివికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు....

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి గిరివికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గిరివికాస పథకం, రహదారి పనుల ప్రగతిపై, రైతు వేదికలు, కల్లాల నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటల సాగుపై రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నార. గిరిజనులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హనుమంతు జెండగేకు సూచించారు. ఏజెన్సీ ప్రాంత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనులకు రూ.కోట్లు మంజూరవుతున్నా అధికారుల అలసత్వంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గిరివికాస పథకం నిధులతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయాని సూచించారు. జిల్లాలో 3,243 కల్లాలు నిర్మించాలని లక్ష్యానికి నిర్దేశించుకోగా ఇప్పటికే 2, 614 పూర్తి చేశామని మరో 723 ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. యాసంగిలో మక్కల సాగు తగ్గించి ఇతర పంటలు సాగుచేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ తెలిపారు. ఈ నెల 15నాటికి 42 వేదికలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సొసైటీ ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేస్తున్నట్లు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ తెలిపారు.

ఐదు ఎకరాలున్న ఇద్దరి రైతులకు ఉమ్మడిగా బోరు, విద్యుత్, మోటర్ మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 163 దరఖాస్తులు స్వీకరించామని 63 మంది రైతుల భూముల్లో సర్వే సైతం పూర్తి చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్, కలెక్టర్ వీపీగౌతమ్, ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హనుమంతు జెండగే, జిల్లా వ్యవసాయ, ఇంజినీరింగ్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాధాకిషన్ రావు, డిప్యూటీ ఇంజినీర్ లక్ష్మణ్, ఎస్సారెస్పీ స్టేజీ వన్ అధికారులు వెంకటేశ్వర్లు, స్టేజీ టు అధికారులు నారాయణ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిరంజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories