Top
logo

వికారాబాద్‌ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మి తనిఖీ

వికారాబాద్‌ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మి తనిఖీ
Highlights

వికారాబాద్‌ జిల్లాలో విద్యాశాఖా మంత్రి ఆకస్మి తనిఖీ శివారెడ్డిపేట్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పర్యటించిన సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతంపై ఆరా ప్రభుత్వ పాఠశాలలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న మంత్రి

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వికారాబాద్‌ జిల్లాలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శివారెడ్డి‌పేట్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజెన్‌లతో గెస్ట్‌ ఉపాధ్యాయులుగా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హాజరు శాతంపై కూడా ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు.

పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి.. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతినెల చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. దీంతో పాటు విద్యావాలంటీర్ల జీతాలు కూడా చెల్లించనున్నట్టు తెలిపారు. పాఠశాలల అభివృద్ధిలో గ్రామాలలోని పూర్వ విద్యార్థులు, దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎంఎల్‌ఏ ఆనంద్‌, నరేందర్‌ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా, డీఈఓ అధికారులు ఉన్నారు.

Next Story


లైవ్ టీవి