ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabhitha Indra Reddy Responds on Intermediate Second Year Exams
x

సబితా ఇంద్రారెడ్డి(ది హన్స్ ఇండియా)

Highlights

Inter Second Year Exams: , ఇంటర్ ద్వితీయ సంవ‌త్స‌రం పరీక్షలను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు

Inter Second Year Exams: క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలపై ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. మొద‌టి సంవ‌త్స‌రం పరీక్షలను ఇప్పటికే రద్దు చేసినప్పటికీ సెకండియర్ పరీక్షల నిర్వహణపై సందిగ్థంలో ప‌డింది ప్ర‌భుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ ఈ విషయమై చర్చకు వచ్చినప్పటికీ పరీక్షల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు, ఇంటర్ ద్వితీయ సంవ‌త్స‌రం పరీక్షలను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. పరీక్షల రద్దు విషయంలో ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. దీనిపై త్వరలోనే సమీక్ష నిర్వహించిన అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు. ఇంటర్‌ పరీక్షలు రద్దు చేశారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories