ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
x
Highlights

ఖమ్మం నగరంలోని నూతనంగా ప్రారంభమైన ఐటీ హబ్‌ను మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఐటీ హబ్‌ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నారు

ఖమ్మం కార్పొరేషన్‌ 5వ డివిజన్ లో మంత్రి పువ్వాడ అజయ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.5వ డివిజన్‌ మెయిన్‌ రోడ్ నుంచి ఖానాపురం వరకు 4 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు విస్తరణ, కాల్వ పనులు, కల్వర్ట్ నిర్మాణం పనులను మేయర్‌తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఖానాపురం వరకు టీఆర్ఎస్‌ శ్రేణులు మంత్రి పువ్వాడకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.

ఇక ఖమ్మం నగరంలోని నూతనంగా ప్రారంభమైన ఐటీ హబ్‌ను మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఐటీ హబ్‌ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. అన్ని జిల్లాలకు ఐటీ విస్తరణకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువలో ఉపాధి అవకాశాలు వచ్చాయని తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories