Ponnam Prabhakar: గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

Minister Ponnam review of Ganesh festival arrangements
x

Ponnam Prabhakar: గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

Highlights

Ponnam Prabhakar: ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

Ponnam Prabhakar: గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ జరిపారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని సూచించారు. సాధ్యమైనంతవరకు మట్టి విగ్రహాలు పెట్టాలని మండపాల నిర్వాహకులకు సలహా ఇచ్చారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై ఆరా తీశారు. సమీక్షలో GHMC, పోలీస్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బి తో పాటు ఇతర శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories