Malla Reddy: మల్కాజ్‌గిరిలో రావణ రాజ్యం పోయి.. రామరాజ్యం వస్తోంది

Minister Malla Reddy Comments Referring To Mynampally
x

Malla Reddy: మల్కాజ్‌గిరిలో రావణ రాజ్యం పోయి.. రామరాజ్యం వస్తోంది

Highlights

Malla Reddy: క్రమశిక్షణ తప్పితే ఎంతటివారైనా చర్యలు తప్పవు

Malla Reddy: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మైనంపల్లిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. మల్కాజ్‌గిరిలో రావణ రాజ్యం పోయి, రామ రాజ్యం వచ్చే రోజు వచ్చిందని విమర్శించారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి బీఫామ్ ఇచ్చేది లేదన్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎంతటివారిపైన హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్నారు.

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్‌గిరిలో గతంలో మంత్రి మల్లారెడ్డిని అడుగుపెట్టనిచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మైనంపల్లి బీఆర్ఎస్‌ను వీడడంతో చాలా ఏళ్ల తర్వాత మల్లారెడ్డి మల్కాజ్‌గిరి గడప తొక్కారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ‌్యర్థిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లుడికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories