logo
తెలంగాణ

అమిత్ షా, రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్

Minister KTRs Visit to Mahabubnagar | Telugu News
X

నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

Highlights

*పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన

Minister KTR: దేశంలో రెండు జాతీయ పార్టీలు నీతిలేని పార్టీలని ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అమిత్ షా, రాహుల్ గాంధీ టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు ఎక్కు పెట్టారు. నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నారాయణపేటలో 81 కోట్ల 44 లక్షల అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. దళితబంధు పథకం లబ్దిదారులకు అస్సెట్స్ పంపిణీ చేశారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్ అభివృద్ది చేసేందుకు 50 ఏళ్లు చేతకాలేదు కాని ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతం చైతన్యం ఉన్న జన్ పథ్ అని ఇది టెన్ జన్ పద్ కాదని రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేశారు. పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్ష పార్టీలకు కండ్లు మండుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.


Web TitleMinister KTR's Visit to Mahabubnagar | Telugu News
Next Story