KTR: నేడు హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

Minister KTR Visit to Hanamkonda District Today
x

KTR: నేడు హన్మకొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

Highlights

KTR: కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

KTR: నేడు హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కాసేపట్లో హెలికాఫ్టర్‌లో కమలాపూర్‌కు రానున్నారు. 49 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 49 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర, బాలిక గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, KGBV కళాశాలకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలసి కేటీఆర్ భోజనం చేస్తారు.

అనంతంరం కమలాపూర్ నుంచి రోడ్డుమార్గం ద్వారా జమ్మికుంటకు వెళుతారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ పాల్గొననున్నారు. కమలాపూర్‌కు తొలిసారిగా మంత్రి కేటీఆర్ వస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను, స్వాగతతోరణాలను ఏర్పాటు చేశారు. దీంతో కమలాపూర్ గులాబీమయమైంది. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories