KTR: నీలోఫర్‌ కేఫ్‌లో మంత్రి కేటీఆర్‌ సందడి

Minister KTR Visit In Niloufer Cafe
x

KTR: నీలోఫర్‌ కేఫ్‌లో మంత్రి కేటీఆర్‌ సందడి

Highlights

KTR: హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మంత్రిని కొనియాడిన ప్రజలు

KTR: నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. అధికారిక కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న మంత్రి బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌లో అక్కడికి వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్‌పై... ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసల వర్షం కురిపించారు.

హైదరాబాదులో శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బెంగళూరులో పని చేస్తున్న యువకుడి కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బెంగళూరు నుంచి తన కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ నగరం వినూత్నంగా కనిపిస్తోందని... పది సంవత్సరాల్లో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని ఆయన తెలిపారు... దశాబ్దాల క్రితం వారణాసి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన తమకు హైదరాబాద్ సిటీ... పది సంవత్సరాల్లో మారిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు...

ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తన కొడుకుకి కేటీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని ఒక మహిళ తెలిపారు... కేటీఆర్ వారి కుటుంబ నేపథ్యం... ప్రభుత్వం పనితీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు... ఆ తర్వాత మైనారిటీ కుటుంబంతో ముచ్చటించిన కేటీఆర్... వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు... హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉందని... మతఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్న తీరుబట్ల మైనార్టీ కుటుంబం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసింది... మంత్రి కేటీఆర్ సాధారణ వ్యక్తిలాగా టీ తాగుతూ పలువురుతో సంభాషించడం చాలామందిని ఆకట్టుకుంది... ఈ సందర్భంగా కేటీఆర్‌తో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories