Top
logo

నేడు ఖమ్మంలో ఐటీ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

నేడు ఖమ్మంలో ఐటీ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌
X
Highlights

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను.. 27 కోట్ల వ్యయంతో నిర్మించారు.

ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను.. 27 కోట్ల వ్యయంతో నిర్మించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌ ఇవాళ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 215 కోట్లతో పలు అభి‌వృద్ధి పను‌లను ప్రారం‌భి‌స్తారు.

ఉదయం 10 గంట‌లకు ఖమ్మం చేరు‌కో‌నున్న కేటీ‌ఆర్‌.. ఖానా‌పురం మినీ ట్యాంక్‌‌బండ్‌, బల్లే‌పల్లి వైకుం‌ఠ‌ధామం, ఖమ్మం-ఇల్లెందు రోడ్డు అభి‌వృద్ధి, సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారం‌భో‌త్సవంతో పాటు కోయ‌చె‌లక రోడ్డు విస్తరణ పను‌లకు శంకు‌స్థా‌పన చేస్తారు. రఘు‌నా‌థ‌పాలెం-వీవీ‌పాలెం అర్‌‌అం‌డ్‌బీ రోడ్డు, రఘు‌నా‌థ‌పాలెం మినీ ట్యాంక్‌‌బండ్‌ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. మధ్యాహ్నం లకారం ట్యాంక్‌‌బండ్‌ జంక్షన్‌లో పీవీ నర‌సిం‌హా‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్త ఓవ‌ర్‌‌బ్రిడ్జి, సెంట్రల్‌ లైటింగ్‌, ప్రొఫె‌సర్‌ జయ‌శం‌కర్‌ విగ్రహా‌న్ని ఆవిష్కరించనున్నారు.

Web TitleMinister KTR to inaugurate IT Park in Khammam today
Next Story