KTR: ఇవాళ ఐదుచోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో

Minister KTR Roadshow at Five Places Today
x

KTR: ఇవాళ ఐదుచోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో

Highlights

KTR: చేవెళ్ల, వికారాబాద్, మర్పల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. నిన్న మొన్నటిదాక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.. ఇప్పుడు హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టారు. జిల్లాలతో పాటు నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ ఐదు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోల్లో పాల్గొననున్నారు. చేవెళ్ల, వికారాబాద్, మర్పల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.

ఇక.. మంత్రి హరీష్‌రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అటు.. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు కవిత. పాలకుర్తిలో ఎర్రబెల్లి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో శ్రీనివాస్‌ గౌడ్, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో తలసాని, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, నల్గొండ జిల్లాలో జగదీష్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్‌రెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గం మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories