చట్ట సవరణలు అవసరం.. ప్రధాని మోదీకి.. కేటీఆర్‌ ట్విట్

చట్ట సవరణలు అవసరం.. ప్రధాని మోదీకి.. కేటీఆర్‌ ట్విట్
x
ప్రధాని మోదీ, కేటీఆర్
Highlights

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ ఇంట్లో ఆడబిడ్డగా భావించి స్పందించారు.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాధతో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో గొంతెత్తారు. అన్ని రంగాల వారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజా ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

ప్రియాంక హత్యా ఘటన పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మహిళలపై దాడులకు చేసేవారికి తక్షణమే శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కేటీఆర్ కోరారు. వరుస ట్విట్లు చేసిన కేటీఆర్ .. నిర్భయ ఘటనలో ఏడేళ్లు గడిచిన నిందితులను ఉరి తీయలేదన్నారు. హన్మకొండలో 9నెలల చిన్నారి విషయంలో కోర్టు ఊరి శిక్ష వేస్తే..హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది అని కెటీఆర్ పేర్కొన్నారు. ప్రియాంక హత్యోదంతం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకోసం ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ల్లో మార్పు చేయాలని కోరారు. దేశంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

చట్టాలకు భయపడని మానవ మృగాల నుంచి దేశాన్ని, మహిళలను కాపాడుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా మన చట్టసభలు ఇలాంటి మానవీయ ఘటనలపై స్పందించి బాధిత కుటుంబాలను న్యాయం జరిగేలా చూడాలి , పార్లమెంట్ లో దీనిపై చర్చ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్పలు చేస్తామని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటివలే తెలిపారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories