అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్

Minister KTR On A Visit To America
x

అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్

Highlights

KTR: విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్

KTR: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధిస్తున్న కేటీఆర్.. న్యూయార్క్ నగరంలో తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని నెమరువేసుకున్నారు. రాష్ట్రంలో నిమిషం సమయం లేకుండా ఎప్పుడూ బిజీ షెడ్యూల్ లో ఉండే కేటీఆర్.. న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడి..వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ లాగించారు. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్.. సాధారణ వ్యక్తిలా క్యూలో ఉండి ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని చూసిన అక్కడి తెలుగు ఎన్నారైలు ఆశ్చర్యపోయారు. అనంతరం తన సమావేశానికి సమయమవుతుందని ఎల్లో క్యాబ్ ఎక్కి బయలుదేరాడు మంత్రి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ సింప్లిసిటీకి, కమిట్మెంట్ కు ఎన్నారైలు అభినందనలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories