logo
తెలంగాణ

Anand mahindra: కేటీఆర్‌ కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్‌ లాగేసుకుంటుంది

Minister KTR Interesting Reply to Anand Mahindra Tweet
X

Anand mahindra: కేటీఆర్‌ కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్‌ లాగేసుకుంటుంది

Highlights

Anand Mahindra-KTR: ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ రిప్లై

Anand Mahindra-KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మెకప్ వేసుకోనున్నారా..? కెమెరా ముందుకు వస్తున్నారా..? యాక్టింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారా..? హీరోనా లేక విలన్ వేషం వేస్తారా..? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. మంత్రి కేటీఆరే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. త్వరలోనే నటిస్తానని తేల్చిచెప్పారు. మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రిప్లై ఇస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి కేటీఆర్ ఎక్కడికెళ్లినా ఆయన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనే లెవెల్లోనే ఉంటుంది. ఏం చేసినా కెమెరా ఫోకస్ ఆయనపైనే ఉంటుంది. వీధుల్లో తిరుగుతున్నా బ్లేజర్ వేసుకున్నా కళ్లకు అద్దాలు పెట్టుకున్నా బ్యూరోక్రాట్ లెవెల్లో ఆయన అహార్యం ఉంటుంది. అలాంటి కేటీఆర్ గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ యాక్టీవ్ గా ఉంటారని ఏం చేసినా అందరినీ ఆలోచింపజేస్తారని అన్నారు. సూట్ వేసుకున్నా ట్రాక్టర్ నడిపినా ఆయన తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా అనిపిస్తారంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. కేటీఆర్ హీరోలా ఉంటారని ఆయన్ని టాలీవుడ్ చూస్తే లాక్కుంటుందంటూ సరదాగా కామెంట్ చేశారు.

అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రిప్లై ట్వీట్ లో కేటీఆర్ కూడా సరదాగా కామెంట్స్ చేశారు. తప్పకుండా కెమెరా ముందుకు వస్తానన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ కోసం మరిన్ని పెట్టుబడులు పెడితే కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన యాడ్ లో నటిస్తానంటూ కేటీఆర్ తెలిపారు. దీంతో ఈ ఇద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరదాగా సాగిన ఈ ట్వీట్లను టీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

Web TitleMinister KTR Interesting Reply to Anand Mahindra Tweet
Next Story