KTR: కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurated Leachate Treatment Plant At Jawaharnagar Dumping Yard
x

KTR: కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Highlights

KTR: మంత్రి కేటీఆర్‌ వెంట మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్‌ విజయలక్ష్మి

KTR: జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 58 జీఓ కింద 3613 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ నేడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాల్లారెడ్డి, శాసన మండలి విప్ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య గత ప్రభుత్వాల శాపమన్నారు. ఈ డంపింగ్ యార్డ్ 3 వేల మెట్రిక్ టన్నుల చెత్త కు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందన్నారు. జవహర్ నగర్‌కు వచ్చే చెత్త ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories