KTR Review Meeting: మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

KTR Review Meeting: మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్ సమీక్ష
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మున్సిపాలిటీల్లో కొత్తగా సిబ్బంధిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పురపాలక చట్టం విధివిధానాల మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలన్నారు.

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన చర్యలు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పట్టణదారుల అవసరాల మేరకు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌, ఇన్‌ఫా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, ప్రజలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఇకపోతే ఇప్పటికే కేబినెట్ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న మూడేండ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. ఆ దిశగా నాయకులు, అధికారులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతే కాక హైదరాబాద్ ‌లో మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్షా నిర్వహించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా కొత్త ఒరవడితో సేకరించాలని ఆయన తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, తడి, పొడి చెత్త సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాల ప్రాతిపదికగా తీసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలోనే నెలకు రూ.12వేల చొప్పున వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పాత బస్సులను తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 400 షీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories