Karimnagar: లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Karimnagar: లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
x
Highlights

కరీంనగర్ లో లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

కరీంనగర్ లో లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు కేటీఆర్‌, ఈటల అధికారులకు మార్గనిర్దేశం చేశారు.అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో వంద శాతం లాక్‌డౌన్‌ అమలయ్యేలా చూడాలని, ఆ ప్రాంతాల్లో ఇళ్లకే నిత్యావసరాలు అందించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో రోజుకు రెండు సార్లు ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరించాలని చెప్పారు. అవసరమైన వారికి తక్షణం కరోనా పరీక్షలు చేసి ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాబోయే పది రోజులు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories