Top
logo

కమలం పార్టీకి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఎటాక్!

కమలం పార్టీకి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఎటాక్!
X
Highlights

కమలం పార్టీకి గట్టి కౌంటర్‌ ఎటాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కేంద్రమంత్రిగా జవదేకర్‌ కూడా అసత్యాలు ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో బీజేపీ ఉందని విమర్శించారు.

కమలం పార్టీకి గట్టి కౌంటర్‌ ఎటాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కేంద్రమంత్రిగా జవదేకర్‌ కూడా అసత్యాలు ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో బీజేపీ ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. రైతులకు రైతు బంధు ఇస్తున్నందుకు ఛార్జ్‌షీట్‌ వేస్తున్నారా..? లేక తెలంగాణలో కరెంటు కష్టాలు తీర్చినందుకు ఛార్జ్‌షీట్‌ వేస్తున్నారో చెప్పాలన్నారు. బీజేపీ నేతలు నిజా నిజాలేంటో తెలుసుకుని ఆరోపణలు చేయాలని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్‌కు కేంద్రం ఏ చేసిందో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని డిమాండ్‌ చేశారు కేటీఅర్. తాము ఏం చేశామో చెప్పే ఓటర్లను ఓటు అడుగుతున్నామని అన్నారు కేటీఅర్. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Web TitleMinister KTR comments on union minister Prakash javadekar
Next Story