ప్రగతి భవన్‎లో మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్

ప్రగతి భవన్‎లో మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్
x
Highlights

తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ జరిపారు. ఈ సందర్భంలో అనేక ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం…భారత దేశంలోనే తెలంగాణ అత్యధికంగా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రంగా నిలిచిందన్నారు.

తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ జరిపారు. ఈ సందర్భంలో అనేక ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం…భారత దేశంలోనే తెలంగాణ అత్యధికంగా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు 27 వేల కోట్ల పైచిలుకు రూపాయలు రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రైతు బంధు పేరుతో మరో 28 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశామని, ఇప్పటివరకూ మొత్తంగా 56 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.

అటు తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని మీడియాలో చూపెట్టే ప్రయత్నం చేయమని కోరారు. తెలంగాణలో 60 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయన్న మంత్రి.. రైతు రుణమాఫీ, రైతు బంధు ద్వారా 95 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు పూర్తి స్థాయిలో లబ్ది చేకూరిందని తెలిపారు. రాహుల్ గాంధీ 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పినా ప్రజలు నమ్మలేదని, విపక్షాలు ఇప్పుడయినా ఆర్బీఐ రిపోర్ట్ తెలుసుకోవాలని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories