Minister KTR: కేంద్రంలోని మోడీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్‌ ఛార్జ్‌షీట్‌

Minister KTR: విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చకుండా.. తెలంగాణతో పాటు ఏపీని కూడా కేంద్రం మోసం చేస్తోంది

Rama Rao
Published on: 29 Oct 2022 2:39 PM IST
Minister KTR Charge Sheet Against the Modi Government at the Centre
X

Minister KTR: కేంద్రంలోని మోడీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్‌ ఛార్జ్‌షీట్‌

Minister KTR: కేంద్రంలోని మోడీ సర్కార్‌పై ఛార్జ్‌షీట్‌ పెడుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్‌. ఏటా 2కోట్ల ఉద్యోగాల పేరుతో తెలంగాణతో పాటు దేశంలోని యువతను మోడీ సర్కార్‌ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చకుండా.. తెలంగాణతో పాటు ఏపీని కూడా కేంద్రం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నోట్లరద్దు పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను అవస్థలపాలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ పెడుతున్నట్టు చెప్పారు మంత్రి కేటీఆర్.

Rama Rao

Rama Rao

Next Story