Harish Rao: బాధితులు ఎవరైనా భరోసా భవన్‌లో న్యాయం పొందవచ్చు

Minister Harish Rao Visit To Siddipet
x

Harish Rao: బాధితులు ఎవరైనా భరోసా భవన్‌లో న్యాయం పొందవచ్చు

Highlights

Harish Rao: ఈ బిల్డింగ్ మహిళా సంరక్షణ సముదాయంగా ఉపయోగపడుతుంది

Harish Rao: సిద్దిపేట జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో సఖి, భరోసా బిల్డింగ్‌లను ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఉమెన్ సేప్టీ ఏడీజీపీ శికాగోయల్, డీఐజీ రమేష్ పాల్గొన్నారు. భరోసా భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా ఉపయోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు. బాధితులు ఎవరైనా భరోసా భవన్‌లో న్యాయం పొందొవచ్చని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి సఖి, భరోసా సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మంత్రి హరీష్‌ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories