Minister Harish Rao : సిద్ధిపేట విద్యార్ధినిని ప్రశంసించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao : సిద్ధిపేట విద్యార్ధినిని  ప్రశంసించిన మంత్రి హరీష్ రావు
x
Highlights

Minister Harish Rao : ఫారెస్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో సిద్దిపేట నియోజకవర్గం బక్రీ చెప్యాలకు చెందిన వెన్నెల అనే విద్యార్థినికి 9వ ర్యాంకు...

Minister Harish Rao : ఫారెస్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో సిద్దిపేట నియోజకవర్గం బక్రీ చెప్యాలకు చెందిన వెన్నెల అనే విద్యార్థినికి 9వ ర్యాంకు సాధించింది. దీంతో వారణసిలోని ప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. సిద్దిపేట జిల్లా నుండి మొట్టమొదటి విద్యార్థిని కావడం విశేషం. దీంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వెన్నెలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోతే సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి- రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి. ఈమె ఇటీవలె ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో బీఎస్సి డిగ్రీ విద్యను పూర్తి చేసింది. గత ఆగస్టు 27న ఎమ్మెస్సి ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం ఎంట్రన్స్ పరీక్ష రాసింది. అయితే ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వెన్నెల దేశంలోనే 9వ ర్యాంకును సాధించి ఇటు తెలంగాణ రాష్ట్రానికే మంచి పేరును తెచ్చిపెట్టింది.

అంతే కాదు ఎంతో మంది విద్యావంతులను, మేదావులను తీర్చిద్ధిద్దిన బెనారస్ యూనివర్సిటీలో అనుకున్నట్టుగానే సీటు దక్కించుకుంది. ఇంత మంచి ర్యాంకు తెచ్చుకున్న వెన్నెలతో సాక్షాత్తు మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడుతూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్ట మొదటి విద్యార్థినిగా సిద్దిపేట జిల్లా ఖ్యాతిని చాటిన వెన్నెలను మెచ్చుకున్నారు. అదే విధంగా బక్రీ చెప్యాల గ్రామస్థులు సైతం తమ ఊరి ఆడబిడ్డ సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. అరుదైన కోర్సులో చేర్పించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కొండల్ రెడ్డి, రేవతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories