Harish Rao: 108 సిబ్బందిని అభినందించిన మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao Congratulated 108 Staff Members
x

Harish Rao: 108 సిబ్బందిని అభినందించిన మంత్రి హరీష్‌రావు

Highlights

Harish Rao: అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని హరీష్ ట్వీట్

Harish Rao: వైద్యశాస్త్ర చరిత్రలోనే అరుదైన సంఘటన తెలంగాణలో జరిగింది. నెల రోజులు కూడా నిండని చిన్నారికి సీపీఆర్ చేసి 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల వయసున్న బిడ్డ ప్రాణాలు కాపాడిన సిబ్బందిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

నిన్న సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో స్నానం చేయించేటప్పుడు నీళ్లు మింగడంతో 23 రోజుల పసికందుకు శ్వాస ఆగిపోయింది. దీంతో వైద్య సిబ్బంది సీపీఆర్‌ చేసి పాప ప్రాణాలను కాపాడారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చద్లాపూర్‌లోని మెగా క్యాంప్‌ కార్యాలయంలో బిహార్‌కు చెందిన దంపతులకు ఆడ శిశువు జన్మించింది. రోజు మాదిరిగానే ఆ పాపకు స్నానం చేయిస్తుండగా నీళ్లు మింగి పాప శ్వాస ఆగిపోయింది. బిడ్డ చలనం లేకుండా ఉండటంతో వెంటనే ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌కు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు 108 నంబర్‌కి ఫోన్‌ చేశారు. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న108 సిబ్బంది పాపను పరీక్షించారు. పాప గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించిన సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. దీంతో పాప స్పృహలోకి వచ్చింది. దీంతో మంత్రి హరీష్ రావు 108 సిబ్బందిని అభినందించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories