గత ప్రభుత్వాల హయాంలో అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చేవారు: మంత్రి హరీష్

X
Highlights
దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో చేగుంట మండల కేంద్రంలో రైతు భారీ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వడియారం గ్రామం నుండి చేగుంట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
admin28 Oct 2020 11:40 AM GMT
దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో చేగుంట మండల కేంద్రంలో రైతు భారీ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వడియారం గ్రామం నుండి చేగుంట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బావుల దగ్గర మీటర్లు అంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అంటే 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చేవారని విమర్శించిన హరీష్.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తుందన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సహాయం, రైతు భీమా, ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
Web TitleMinister Harish Rao comments on BJP and Congress party's
Next Story