Top
logo

ఎమ్మెల్యే అహ్మద్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అహ్మద్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు.

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నారు. నిన్న మొన్న మాటలు నేర్చిన చిలుక అని మంత్రి కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి నాయకులను ఎందరినో చూశామని మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ ఖాన్ అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తాతో సమానమని అహ్మద్‌ఖాన్‌ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

టీఆర్ఎస్ తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఒవైసీ

అటు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాము మొత్తం 52 స్థానాలలో పోటి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో పాదయాత్ర నిర్వహించిన ఒవైసీ బీజేపీ పైన విమర్శలు చేశారు. హైదరాబాద్ లో భారీ వరదలు వచ్చిన కేంద్రం సహాయం చేయలేదని అన్నారు.

Web TitleMIM Mla Ahmad khan sensational comments on Minister KTR
Next Story