తెలుగు రాష్ట్రాల్లో చలిపులి.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Meteorological Department issued an Orange Alert due to Very Low Temperatures Recorded in Telugu States | Weather Report
x

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Highlights

Weather Report Today: *తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు *విశాఖ ఏజెన్సీలోనూ చలి తీవ్రత

Weather Report Today: తెలుగు రాష్ట్రాలను చలి బెంబెలెత్తిస్తోంది. ఉత్తరం, ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలులతో రానున్న నాలుగు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

దీంతో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. అటు విశాఖ ఏజెన్సీలోనూ చలి తీవ్రత పెరిగింది. లంబసింగిలో 4.1 డిగ్రీలు, చింతపల్లిలో 5.8, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రోడ్లపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories