Kurti Village - Kamareddy: గ్రామం చుట్టూ వరద నీళ్లు, డ్రోన్‌తో మందులు తరలింపు

Medicine from the Sky Helped Emergency in Kurti Village Immersed in Water in Kamareddy | Telangana Latest News
x

గ్రామం చుట్టూ వరద నీళ్లు, డ్రోన్‌తో మందులు తరలింపు

Highlights

Kurti Village - Kamareddy: * జలదిగ్బంధంలో కామారెడ్డి జిల్లా కుర్తిగ్రామం * మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు

Kurti Village - Kamareddy: ఆ గ్రామం నలువైపులా జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాకపోకలకు తావే లేదు. ఈ తరుణంలో అనారోగ్యంతో ఉన్న ఓ బాలుడికి మందులు అత్యవసరమయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి.. ఆ బాలుడికి డ్రోన్‌ ద్వారా మందులను అందజేశారు. ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం సోమవారం జల దిగ్బంధమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

కుర్తి గ్రామానికి చెందిన మిరియాల గంగారాం కుమారుడు కన్నయ్య అనారోగ్యంతో ఉన్నాడని, వైద్యుని వద్దకు వెళ్లే పరిస్థితి లేదని, అతనికి అత్యవసరంగా మందులు కావాలని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఫోన్‌ ద్వారా బాలుడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు అతడికి అవసరమైన మందులను డ్రోన్‌ ద్వారా బ్రిడ్జి అవతల వైపుకు చేర్చగా, ఆశ వర్కర్‌ వాటిని బాలుడి ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. తక్షణమే స్పందించిన అధికారులకు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories