కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లలో దళారుల దందా

కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ లలో దళారుల దందా
x
Kalyana lakshmi
Highlights

నియోజకవర్గంలోని ఘనపూర్, చిల్పూర్, ధర్మసాగర్ మండలాలలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు దళారులు.

స్టేషన్ ఘనపూర్: నియోజకవర్గంలోని జాఫర్ గడ్, ఘనపూర్, చిల్పూర్, ధర్మసాగర్, వేలెర్, మండలాలలో కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ల లబ్ధిదారుల దగ్గర మీరేమి చేయకండి డబ్బులు మేము ఇంపిస్తామంటూ వేళల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు దళారులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెదప్రజల ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లిచేయాలంటే తలకుమించిన భారం అవుతుందని, ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టంలో కొంచెం సాయం చేస్తూ ప్రతి ఆడపిల్ల ఇంట్లో పెద్దన్న సాయం చేస్తున్నారు. కానీ కొందరు దళారులు దీనిలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రతి దానికీ డబ్బులు తీసుకుంటున్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రాసెస్ మొదలు పెట్టగానే దళారులు వారి వెంటపడడం మొదలు పెడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని మేమే చూసుకుంటమంటారు. గెజిటెడ్ సంతకల కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు వెళితే వందల ప్రశ్నలు అడుగుతారు కానీ ఇదే దళారులు వెళితే అది ఎవరిది వారికి ఎంత వయస్సు ఉంది అని ఏమి చూడకుండా డబ్బులు తీసుకొని సంతకాలు పెడుతున్నారు. అదే ఎమ్మెల్యే సంతకానికి, చెక్కు తీసుకోవడానికి లబ్ధిదారులను పంపుతూ డబ్బులు రాగానే అందులో నుండి 10000.నుండి 20000 వేల వరకు వసూలు చేస్తూ పేద ఆడపిల్లల తల్లిదండ్రుల డబ్బులు లాగుతున్నారు. ఈ దళారులను ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలని ఆడపిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories