Medaram Jathara: రేపు మేడారం జాతర ప్రారంభం.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠ..

Medaram Sammakka Saralamma Jatara Begin Tomorrow
x

Medaram Jathara: రేపు మేడారం జాతర ప్రారంభం.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠ.. 

Highlights

Medaram Jathara: జాతరకు పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులు

Medaram Jathara: తెలంగాణ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్నది. రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు తరలిరానున్నారు. కుంభమేళను తలపించే విధంగా జరగనున్న జాతర సందర్శనకు భక్తులు ఇప్పటికే బారులు తీరుతున్నారు. పలు వాహనాలు మేడారం బాట పట్టాయి.

జాతర తొలిరోజున మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ దేవాలయం నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజను, ములుగు జిల్లా కన్నేపల్లి నుంచి జంపన్నను గిరిజన సాంప్రదాయాల నడుమ శివసత్తుల పూనకాల మధ్య పూజారులు మేడారానికి తరలించనున్నారు. ఆలయంలో పూజల అనంతరం పగిడిద్దరాజను పెళ్లికొడుకుగా సిద్ధం చేసి గ్రామంలో ఊరేగిస్తారు. అక్కడి నుంచి పూజారులు కాలి నడకన పూనుగొండ్ల అడవుల నుంచి మేజారానికి బయల్దేరుతారు. చివరగా సమ్మక్కను కుకంమ భరిణె రూపంలో చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్తులు తెచ్చి గడ్డపైన ప్రతిష్టిస్తారు. మూడో రోజున భక్తులు బెల్లంను బంగారంగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు వనప్రవేశం చేయడంలో ఈ జాతర ముగుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories